‘రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేసింది..
- September 29, 2025
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అంచనాలు నెలకొల్పారు. తాజాగా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు ట్రైలర్ తో అధికారికంగా ప్రకటించారు.
ట్రైలర్ లో.. ప్రభాస్ ఓ పాత బంగ్లాకు వెళ్లడం, అక్కడ దయ్యం రావడం, మధ్యలో కాస్త కామెడీ, హీరోయిన్స్ తో లవ్ చూపించగా చివర్లో దయ్యం ప్రభాస్ పాత్రని ఆవహించినట్టు చూపించారు. చివర్లో.. ఏందిరా మీ బాధ పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా.. రాక్షసుడిని అంటూ తాత గెటప్ లో డైలాగ్ చెప్పాడు ప్రభాస్. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలు ఉండగానే ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటో, వచ్చే నెల ఎలాగో ప్రభాస్ పుట్టిన రోజు ఉంది కదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







