ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!

- October 03, 2025 , by Maagulf
ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!

కువైట్: కేరళ నుండి నడిచే అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మార్పులు చేసింది. ఇందులో కీలకమైన గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి.  అదే సమయంలో ప్రధాన కార్యాలయాన్ని కొచ్చి నుండి హర్యానాలోని గురుగ్రామ్‌కు మార్చింది. దీంతో కేరళ నుండి వారానికి ఏడు సార్లు నడిచే ఫ్లైట్స్.. ఇప్పుడు సగానికి తగ్గనున్నాయి.

తిరువనంతపురం నుండి దుబాయ్, అబుదాబి, మస్కట్, కువైట్, షార్జా, రియాద్ మరియు జెడ్డాకు నడిచే ఫ్లైట్ సర్వీసుల్లో కొన్ని మార్గాలను రద్దు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ క్యారియర్లు ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఎమిరేట్స్ వంటి ఖరీదైన విమానయాన సంస్థలకు మారుతున్నారు.  కేరళలో కార్యకలాపాలను తగ్గించి, ఉత్తర భారతదేశానికి విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా అంతకుముందు ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిర్ణయంతో కువైట్ లో కేరళ ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com