అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- October 03, 2025
దుబాయ్: అనుమతి లేకుండా ఒక మహిళ దృశ్యాలను షూట్ చేసిన వ్యక్తిని అబుదాబి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆమె గోప్యతను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి Dh30,000 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సదరు మహిళకు పరిహారం కింద అందజేయాలని తన తీర్పులో పేర్కొంది.
అబుదాబి క్రిమినల్ కోర్టు గతంలో అనుమతి లేకుండా మహిళను ఫోటోలు తీసినందుకు ఆ వ్యక్తికి Dh10,000 జరిమానా విధించింది. తీర్పు తర్వాత, ఆ మహిళ తనకు కలిగిన భావోద్వేగ మరియు ప్రతిష్టకు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేసింది.
అబుదాబి ఫ్యామిలీ, సివిల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కోర్టు కూడా ఆ వ్యక్తికి చట్టపరమైన ఖర్చులతో పాటు ఆ మహిళకు Dh20,000 పరిహారం చెల్లించాలని ఆదేశించిందని కోర్టు రికార్డులు తెలిపాయి. ఈ తీర్పు ప్రకారం, ఆ వ్యక్తి గతంలో విధించిన క్రిమినల్ జరిమానా మరియు పౌర నష్టపరిహారంతో సహా మొత్తం Dh30,000 చెల్లించాలని అబుదాబి కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







