ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి

- October 05, 2025 , by Maagulf
ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి

న్యూ ఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో తెలంగాణ ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా వెలుగొందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులు గ్రామానికి చెందిన తాళ్లూరి పల్లవి  అనే యువతి తన అసాధారణ ప్రతిభతో దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన పల్లవి, జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.

ఢిల్లీలొ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలొ సత్తా చాటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌లో ప్రధాని ఈ అవార్డును అందించారు.

యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రదానం చేశారు.

ఇందులో బాగంగానే ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్‌ విభాగంలొ ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌ గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈసందర్బంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజిత అనందం వ్యక్తం చేశారు. జిల్లా యువతి టాపర్ గా నిలవడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమెను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com