'డ్యూడ్' నుంచి హై-ఎనర్జీ ఫన్ ట్రాక్ సింగారి రిలీజ్
- October 05, 2025
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా విడుదలైన బూమ్ బూమ్, బాగుండు పో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
మ్యూజిక్ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సింగారి’ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్ ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్ కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది. ఫన్ ఫుల్ గా వినిపించే ఈ ట్రాక్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
ప్రదీప్ అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు పాటకు మరింత మజాను తెచ్చాయి.
సాయి అభ్యంకర్ తన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే అన్ని భాషల యువతరంలో సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నికేత్ బొమ్మి, ఎడిటర్ భరత్ విక్రమన్, ప్రొడక్షన్ డిజైనర్ లతా నాయుడు.
డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: భరత్ విక్రమన్
తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







