సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- October 06, 2025
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై దాడి ప్రయత్నం జరిగిన ఘటన న్యాయ వర్గాలను, దేశవ్యాప్తంగా ప్రజలను కలకలం రేపింది. లాయర్ దుస్తుల్లో కోర్టు హాల్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి, అకస్మాత్తుగా డయాస్ వద్దకు వెళ్లి సీ జే ఐపై ఓ వస్తువును విసరడానికి ప్రయత్నించాడు. అయితే సుప్రీంకోర్టు సిబ్బంది అప్రమత్తంగా స్పందించి అతడిని వెంటనే అడ్డుకొని బయటకు తరలించారు. ఈ క్రమంలో కోర్టు హాల్‌లో కొంత గందరగోళం నెలకొంది.
ఆ వ్యక్తి “సనాతన ధర్మాన్ని కించపరిచేవారిని వదిలిపెట్టం” అంటూ నినాదాలు చేస్తూ దాడికి యత్నించడం, ఈ ఘటనకు మతపరమైన కోణం కలిపి మరింత సీరియస్‌గా మారింది. విచారణకు వచ్చిన వ్యక్తులు లేదా లాయర్ల వేషంలో ఉండే ఇతరులు భద్రతా మార్గాలను ఎలావిధంగా దాటుతున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఇలాంటి ఘటన జరగడం దేశ భద్రతా వ్యవస్థపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని న్యాయవర్గాలు, నిపుణులు సూచిస్తున్నారు.
సీ జే ఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ (CJI Gavai) మాత్రం తన ప్రశాంత స్వభావాన్ని ప్రదర్శిస్తూ, “మీ వాదనలు వినిపించండి. ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయవు” అని లాయర్లకు సూచించారు. ఇది ఆయన ధైర్యసాహసాలను, న్యాయస్ఫూర్తిని ప్రతిబింబించడమే కాకుండా, న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఈ ఘటన ద్వారా న్యాయసంస్థల గౌరవం, స్వతంత్రత కాపాడటంలో భద్రతా వ్యవస్థలు ఎంత బలోపేతం కావాలో మరోసారి చర్చకు వచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







