విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- October 06, 2025
విశాఖపట్నం: భారత మహిళా క్రికెటర్లను గుర్తించాలని స్మృతి మంధాన చేసిన హృదయపూర్వక సూచన వాస్తవ రూపం దాల్చనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
2025 అక్టోబర్ 12న స్టాండ్లకు మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టనున్నారు. ఆ రోజు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వైజాగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టాండ్లకు పేర్లు పెట్టనున్నారు.
ఆగస్టు 2025లో `బ్రేకింగ్ బౌండరీస్` కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో పాటు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పాల్గొన్నారు. ఈ సందర్భంలో.. విశాఖపట్నంతో పాటు వివిధ వేదికల్లో పురుషుల దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టాండ్స్ ఉన్నాయని, భారత మహిళా దిగ్గజ క్రికెటర్లతో పేర్లతో స్టాండ్స్ లేవనే విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి స్మృతి మంధాన తీసుకువచ్చారు. స్టాండ్లకు మహిళా క్రికెటర్ల పేర్లను పెట్టడం వల్ల వారు క్రికెట్ కు చేసిన కృషిని గౌరవించినట్లు అవుతుందని, అదే సమయంలో యువ మహిళా ప్లేయర్లకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
మంధాన విజ్ఞప్తి పై మంత్రి లోకేష్..ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించారు.ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఆంధ్రలో జన్మించి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రవి కల్పనల పేర్లను పెట్టాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీర్మానించింది.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్