డ్యూడ్‌ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: హీరో ప్రదీప్ రంగనాథన్

- October 08, 2025 , by Maagulf
డ్యూడ్‌ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: హీరో ప్రదీప్ రంగనాథన్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా  సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  డ్యూడ్‌ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.చాలా రిలేటబుల్ క్యారెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ కన్వెన్షన్ చాలా నచ్చింది.  తిరుపతి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తిరుపతిలో ఒక పాజిటివ్ వైబ్  ఉంటుంది.

సినిమా మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. దయచేసి పైరసీని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. డ్యూడ్ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్స్ లో  చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com