ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- October 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్జెండర్ల చర్యలు అదుపు తప్పాయని, వారు బహిరంగంగా రూపాయలు వేలు డిమాండ్ చేస్తూ.. ఇవ్వని వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కమిషనర్ సజ్జనార్ను ట్యాగ్ చేశారు.
ఈ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ స్పందించారు.ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఆయన జవాబిచ్చారు. ఆరోపణలలోని నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని ధృవీకరించిన తర్వాత చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







