ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఏర్పాటు..

- July 21, 2016 , by Maagulf
ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఏర్పాటు..

తమిళ సూపర్ స్టార్ తలైవా నటించిన సెన్సేషనల్ మూవీ కబాలి ఎన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రోజైతే రజినీకాంత్ ఫస్ట్ లుక్ విడుదలైందో ఆ రోజు నుండి సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సినిమా గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ఆరాట పడ్డారు. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్ధ ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఏర్పాటు చేసి రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది. అయితే ఈ విమానాలపై కబాలి పోస్టర్స్‌ని ఎలా రూపొందించారో, దానికి సంబంధించి ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇండియన్ హిస్టరీలో తొలిసారి ఇలా సినిమా పోస్టర్స్ ఫ్లైట్ పైకి ఎక్కగా దీనికోసం దాదాపు 300 పైబడి టెక్నీషియన్స్ పనిచేశారు. 200 గంటలు ఎంతో డెడికేషన్‌తో ఈ వర్క్ పూర్తి చేశారు. అయితే ఇది కేవలం ఒకే ఒక్క మనిషి రజనీకాంత్‌పైన లవ్‌తోనే అని చెప్పడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com