త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. జగన్
- July 21, 2016
'బెజవాడ వెళ్లిపోదాం.. ఆఫీసు చూడండి' అని పార్టీ సీనియర్ నేతలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రాజకీయ పక్షాలన్నీ విజయవాడలోనో లేదా గుంటూరులోనో పార్టీ కార్యాలయాలను తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే, కాంగ్రెస్ విజయవాడలోని నగర కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చుకుంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇంకా హైదరాబాద్ నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. గురువారం సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. పార్టీ కార్యాలయం చూడాలని సీనియర్ నేత సత్తిబాబుతో జగన్ అన్నారు. దీంతో.. ఆగస్టు 3వ తేదీ తర్వాత పార్టీ కార్యాలయాన్ని చూసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







