సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాలు.
- July 21, 2016
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాల్లో గురువారం అమెరికా సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 15 మంది చిన్నారులుసహా 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని డమాస్కస్‌కు తూర్పున ఉన్న గౌట ప్రాంతంలో దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారని 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ తెలిపింది. డ్యూమాలోనూ దాడులు కొనసాగాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ తెలిపారు.అలెప్పో సమీపంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులుసహా 15 మంది చనిపోయారు. అలెప్పో సిటీ గత రెండు వారాలుగా సైన్యం ముట్టడిలో ఉంది. ఇడ్లిబ్‌కు నైరుతి దిశలో ఉన్న వేర్వేరు ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో మొత్తం 30 మంది మరణించారు. 2011 మార్చిలో దేశంలో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2,80,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు సగం దేశజనాభా స్వస్థలాలను వదిలివెళ్లింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







