మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- October 10, 2025
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తన రాజకీయ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో పాటు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు.
ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. సునాక్ ఈ నియామకం ద్వారా మళ్లీ గ్లోబల్ స్టేజ్‌పై తన మేధస్సుతో ప్రభావం చూపే అవకాశం పొందారు.
గత జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సునాక్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఈ కొత్త బాధ్యతల గురించి రిషి సునాక్ తన లింక్డ్ఇన్ పోస్టులో స్వయంగా వెల్లడించారు.
ఈ రెండు పదవుల ద్వారా తనకు లభించే ఆదాయాన్ని మొత్తం తన భార్య అక్షతా మూర్తి తో కలిసి ప్రారంభించిన ‘ది రిచ్మండ్ ప్రాజెక్ట్’ అనే ఛారిటీ సంస్థకు విరాళంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆంత్రోపిక్ సంస్థలో సునాక్ పాత్ర ప్రధానంగా అంతర్గత వ్యవహారాలకు,వ్యూహాత్మక సలహాలకు మాత్రమే పరిమితం కానుంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆయన కంపెనీకి మార్గనిర్దేశం చేస్తారు. ఇక మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆయన ఇదే తరహా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







