భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్‌

- October 10, 2025 , by Maagulf
భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్‌

న్యూ ఢిల్లీ: అమెరికాలో చదువు అవకాశాలు తగ్గుతున్న వేళ, ఇతర దేశాలు భారత విద్యార్థులను ఆకర్షించేందుకు ముందుకొస్తున్నాయి.ఇప్పటికే చైనా, యూకేలు తమ దేశాల్లో చదువు అవకాశాల కోసం భారతీయ విద్యార్థులను ఆహ్వానించగా, ఇప్పుడు బ్రిటన్ యూనివర్సిటీలు నేరుగా భారత్‌లోకి వస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాధినేతలు విద్యా రంగంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీని ప్రకారం తొమ్మిది ప్రముఖ యూకే యూనివర్సిటీలు భారతదేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. స్టార్మర్‌తో పాటు యూకే విద్యా ప్రతినిధి బృందం కూడా భారత్‌ను సందర్శించింది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే గురుగ్రామ్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించింది, మొదటి బ్యాచ్ విద్యార్థులు కూడా చేరారు.

ఈ ఒప్పందం ద్వారా భారతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్లకుండా ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యను పొందగలరని ప్రధాని మోదీ తెలిపారు. ఇది ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుందని ఆయన అన్నారు. ఐదు ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలు ప్రధాన భారతీయ నగరాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబైలో ఎంటర్‌ప్రైజ్ క్యాంపస్ ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుమతి పొందింది. ఈ క్యాంపస్‌లు 2026 వేసవిలో విద్యార్థులను స్వాగతించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com