#RT76 ఈరోజు నుంచి లెన్తీ ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం
- October 10, 2025
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.
టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రికీ పనులు పూర్తి చేశారు. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమవుతోంది. అనంతరం జెనీవా, ఫ్రాన్స్‌లో కూడా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
మొత్తం 25 రోజుల ఈ షెడ్యూల్లో కీలక టాకీ పార్ట్లతో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ళ. నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
తారాగణం: రవితేజ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







