ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అక్టోబర్ 12న రిలీజ్
- October 10, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ రోజు అంధ్ర కింగ్ తాలూకా టీమ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ పోస్టర్లో రామ్, భాగ్యశ్రీ ఇద్దరూ నవ్వుతూ కనిపించగా, వారి మధ్యలో ప్రొజెక్టర్ లైట్ బీమ్ కనిపించడం సినిమాటిక్ థీమ్‌ను ప్రజెంట్ చేస్తోంది.
ఇప్పటికే వివేక్ & మెర్విన్ అందించిన మొదటి రెండు పాటలతో టీం హ్యుజ్ హైప్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే ద్వారా రామ్ తన సింగింగ్ డెబ్యూ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాట ప్రేక్షకుల మనసులను దోచుకుని బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రెండవ పాట పప్పీ షేమ్ డిఫరెంట్వైబ్ తో అదిరిపోయింది. ఈ సాంగ్ కి రామ్ స్వయంగా వాయిస్ ఇచ్చారు.
ఉపేంద్ర ఈ చిత్రంలో సూపర్ స్టార్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్,
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







