కేంద్రం సంచలన నిర్ణయం..
- October 13, 2025
న్యూ ఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ యుగంలోకి అడుగుపెట్టింది. ప్రతి రంగంలోనూ సాంకేతికతే ఆధిపత్యం చెలాయిస్తోంది. కమ్యూనికేషన్ నుంచి విద్య వరకు, ఉద్యోగాల నుంచి వైద్య రంగం వరకు అన్ని విభాగాల్లో టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం,రాబోయే దశాబ్దాల్లో ఈ ప్రభావం మరింత విస్తరించబోతోంది.ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విద్యా రంగంలో ఒక సంస్కరణను ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్కూల్ దశ నుంచే విద్యార్థులకు టెక్నాలజీ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ మొత్తం టెక్నాలజీతో నిండి ఉండటంతో విద్యార్థులను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని పాఠశాలల్లో 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) ను పాఠ్యాంశాల్లో తప్పనిసరి బోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (CBSE) అన్ని తరగతులకు ఏఐని అనుసంధానం చేయడానికి ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది.ఈ ఏఐ బోధనకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ స్పందించారు.
ఈ సరికొత్త నిర్ణయానికి సంబంధించి అతిపెద్ద సవాల్ ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటి మందికి పైగా టీచర్లకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద సవాల్ అని తెలిపారు.
రాబోయే 2, 3 సంవత్సరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ టెక్నాలజీకి అనుగుణంగా మారేలా వేగంగా ముందుకు సాగాలని వెల్లడించారు.ప్రస్తుతం 18 వేల కంటే ఎక్కువ సీబీఎస్ఈ స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య అంశంగా అందిస్తున్నారు.
దీనికి 15 గంటల మాడ్యూల్ ఉంటుంది. 9 నుంచి 12వ తరగతులకు మాత్రం దీన్ని ఒక ఆప్షనల్‌గా ఉంచారు. 2019లో ఈ కార్యక్రమం ప్రారంభించినపుడు.. ఏఐని ఎంచుకున్న 9-10 తరగతి విద్యార్థులు 15 వేల మంది కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 7.9 లక్షలకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!