పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- October 14, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనల సరళీకరణకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు పీఎఫ్ విత్ డ్రా కోసం ప్రయత్నించిన వారికి.. కేవలం ఉద్యోగికి సంబంధించిన సొమ్ములోనే విత్ డ్రా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండేది. అంతేకాదు.. కొన్ని నిబంధనలు కూడా ఉండేవి.. దీంతో చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తమ పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇక నుండి అలాంటి సమస్యలకు చెక్ పడనుండి. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనల సరళీకరణకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది.
కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ పీఎఫ్ విత్ డ్రాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి, యాజమాని వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హమైన బ్యాలెన్స్ లో ఇక నుంచి చందాదారులు 100శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చునని, ఆ మేరకు త్వరలో నిబంధనలు సడలింపు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఏడు కోట్లకుపైగా చందాదారులకు ప్రయోజనం కలగనుంది.
అదేవిధంగా ఈ సమావేశంలో పీఎఫ్ పాక్షిక విత్ డ్రాకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా క్రమబద్దీకరించింది. మూడు రకాలుగా వర్గీకరించింది. అనారోగ్యం, విద్య, వివాహం వంటి వాటిని ముఖ్యమైన అవసరాలుగా, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు ఇలా మూడు రకాలుగా విభజించింది.
పీఎఫ్ ఖాతాదారులకు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్షియల్ పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే నిరుద్యోగం, ప్రకృతి లేదా కంపెనీ మూసివేత వంటి నిర్ధిష్ట కారణాలు చూపించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం.. ఖాతాదారులు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు చేసుకొని పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
పీఎఫ్ విత్‌డ్రా లిమిట్స్‌ను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక.. చదువుకోసం 10సార్లు, వివాహం విషయంలో ఐదు సార్లు వరకు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటికి మూడు సార్లు వరకే పరిమితి ఉంది. అన్ని పాక్షిక ఉపసంహరణలకు చందాదారుల కనీస సర్వీస్‌ను 12 నెలలకు తగ్గించింది. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పాక్షిక పీఎఫ్ ఉపసంహరణకు నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ప్రస్తుతం ఇలాంటి కారణాలు చూపించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాలో జమచేసే మొత్తంలో 25శాతాన్ని కనీస బ్యాలెన్స్ గా ఉండేలా నిబంధన పెట్టారు. దీని ద్వారా ఈపీఎఫ్ లో ఇస్తున్న వడ్డీ రేటుతో రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!