సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- October 16, 2025
రియాద్: సౌదీ అరేబియా వార్షిక ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్ లో 2.2 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ 2024లో ఇది 1.7 శాతంగా ఉంది. గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్ మరియు ఇతర ఇంధనాల పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల చోటుచేసుకుందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది.
కాగా, వినియోగదారుల ధరల సూచిక (CPI) లేదా ద్రవ్యోల్బణం ఆగస్టు లో నెలవారీ ప్రాతిపదికన 2.3 శాతం నుండి 0.1 శాతం స్వల్పంగా తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు నివాస అద్దెలు అత్యంత ముఖ్యమైన కారకంగా ఉన్నాయని, ఇది 6.7 శాతం పెరిగిందని నివేదికలో తెలిపారు. ప్రయాణికుల రవాణా ధరలలో 6.9 శాతం పెరుగుదల కారణంగా రవాణా ధరలు 1.6 శాతం పెరిగాయి. బీమా మరియు ఆర్థిక సేవల ధరలు 7.7 శాతం పెరిగాయి. ఫర్నిచర్, గృహోపకరణాల ధరలు 0.6 శాతం తగ్గాయి.
ఇక కమ్యూనికేషన్ ధరలు 0.4 శాతం తగ్గగా.. సమాచార, కమ్యూనికేషన్ పరికరాల ధరలలో 6.4 శాతం తగ్గుదల నమోదైంది. రెస్టారెంట్ ధరలు 1.4 శాతం తగ్గుదల నమోదయ్యాయి. వ్యవసాయ మరియు మత్స్య ఉత్పత్తుల ధరలలో 4.7 శాతం పెరిగయి. మొత్తం 582 వస్తువులు మరియు సేవల ధరలలో మార్పులను వినియోగదారుల ధరల సూచిక వెల్లడిస్తుంది.
తాజా వార్తలు
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!