12వ లివా డేట్‌ ఫెస్టివల్‌

- July 22, 2016 , by Maagulf
12వ లివా డేట్‌ ఫెస్టివల్‌

12వ లివా డేట్‌ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమయ్యింది. పెద్ద సంఖ్యలో డేట్స్‌ ప్రదర్శనకు ఉంచడం, అందులో మేలు జాతికి అవార్డులు ప్రదానం చేయడం ఈ డేట్‌ ఫెస్టివల్‌ ప్రత్యేకత. 34కి పైగా పార్టిసిపెంట్స్‌ ఈసారి డేట్స్‌ ఫెస్టివల్‌కి ప్రధాన ఆకర్షణ. 2000 ఉంచి 50,000 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ వరకూ టాప్‌ ఫైవ్‌ హెవీ బంచ్‌ ఆఫ్‌ డేట్స్‌కి ఈ సందర్భంగా రివార్డులు ఇవ్వనున్నారు. అబుదాబీ ఫార్మర్స్‌ సర్వీసెస్‌ సెంటర్‌ ఎడిఎఫ్‌ఎస్‌సి కూడా ఈసారి ఫెస్టివల్‌లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యింది. పామ్‌ ట్రీలపై పెంపకందార్లకు ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తారు. రెడ్‌ పామ్‌ వీవిల్‌ అనే బీటిల్‌ జాతికి చెందిన కీటకం, పామ్‌ ట్రీస్‌ని దెబ్బతీస్తుంటాయి. వీటిని నివారించేందుకు తగిన చర్యల్ని కూడా రైతులకు వివరిస్తారు. అబుదాబీలో మొత్తం 6.7 మిలియన్ల పామ్‌ ట్రీస్‌ ఉన్నాయనేది ఓ అంచనా. అయితే 2013 - 2016 మధ్య పామ్‌ వీవిల్స్‌ తొలగించబడ్డాయి. ఇదిలా ఉండగా డేట్స్‌లో డబ్బాస్‌, ఖల్లాస్‌, కునైజి, ఫార్త్‌, బో మాన్‌ వంటివి ప్రముఖమైన రకాలు. ఏదేమైనా డేట్స్‌ ఫెస్టివల్‌ ఈసారి గతంలోకన్నా ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com