మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం

- October 18, 2025 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం

హైదరాబాద్‌: ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, ప్రాణాలను రక్షించడంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రామా అండ్ ఆక్యూట్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించింది.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ట్రామా (ఆకస్మిక గాయాలు) ఇప్పుడు కేవలం రోడ్డు ప్రమాదాలకు మాత్రమే పరిమితం కాదు. మెట్లు జారిపడటం, నిర్మాణ ప్రాంగణ ప్రమాదాలు, ఇంటి మరియు కార్యాలయ గాయాలు వంటి సంఘటనలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం సుమారు 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.5 లక్షల మరణాలు, మరియు 3 లక్షల తీవ్రమైన గాయాలు సంభవిస్తున్నాయి. వీటిలో దాదాపు 50% మరణాలు సరైన సమయాన చికిత్స అందితే నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ఈ విభాగాన్ని డా.దామోదర్ కాకుమాను, కన్సల్టెంట్ ట్రామా & ఆక్యూట్ కేర్ సర్జన్‌ నేతృత్వంలో ప్రారంభించారు. ఆయ‌న AIIMS, న్యూ ఢిల్లీ నుండి M.Ch. (Trauma Surgery & Critical Care) పట్టా పొందారు. ఆయ‌న మార్గదర్శకత్వంలో మెడికవర్‌లో అత్యాధునిక ట్రామా ప్రోటోకాల్స్‌, వేగవంతమైన స్పందన వ్యవస్థలు, మరియు బహుళ వైద్య విభాగాల సమన్వయంతో రోగుల ప్రాణరక్షణలో కొత్త దిశను చూపిస్తున్నారు.
“నగరాల్లో ట్రామా కేసులు చాలా సాధారణంగా జరుగుతుంటాయి కానీ వాటిని చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తారు. మొదట్లోనే గుర్తించి, వెంటనే స్పందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు,” అని డా.దామోదర్ కాకుమాను తెలిపారు.

మెడికవర్ హైటెక్ సిటీలోని లెవల్–1 ట్రామా సెంటర్‌లో 24×7 అత్యవసర వైద్య సేవలు, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మరియు ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఫిజియోథెరపీ వంటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రమాదం జరిగిన క్షణం నుండి పూర్తిస్థాయి కోలుకునే వరకు రోగికి సమగ్ర సేవలు అందించేలా విభాగం రూపొందించబడింది. రోగుల శారీరక, మానసిక పునరుద్ధరణపై కూడా ప్రత్యేక దృష్టి సారించబడింది.
ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీచైతన్య ఐఐటీ క్యాంపస్‌ మరియు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. డా. దామోదర్ కాకుమాను మరియు ట్రామా కేర్ బృందం విద్యార్థులు, ప్రజలకు రోడ్డు భద్రత, బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), ప్రమాద సమయంలో చేయాల్సిన మొదటి చర్యలు, రక్తస్రావ నియంత్రణ, మరియు రోగిని సురక్షితంగా తరలించే విధానాలు పై ప్రత్యక్ష ప్రదర్శనలు చేశారు.

అనేకమంది విద్యార్థులు, ప్రయాణికులు పాల్గొని ట్రామా నివారణ, ప్రాణరక్షణ చర్యలపై అవగాహన పొందారు. రోడ్డు భద్రత, హెల్మెట్‌ మరియు సీటు బెల్ట్‌ వినియోగంపై సమాచారం కలిగిన బ్రోషర్లు, లీఫ్‌లెట్లు పంపిణీ చేయబడ్డాయి.

సమాజంలో ప్రమాదాలపై అవగాహన పెంచడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్‌ నిరంతరం విద్యా, శిక్షణ మరియు ప్రజా కార్యక్రమాలు చేపడుతోందని ప్రతినిధులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com