గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- October 18, 2025
జెనీవా: యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) గాజా స్ట్రిప్‌లోకి వెళ్లే అన్ని సరిహద్దు క్రాసింగ్‌లను తెరవాలని కోరింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఇది సహాయ పడుతుందని WFP ప్రతినిధి అబీర్ ఎటెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు పంపిణీ కేంద్రాలు నివాసితులకు దగ్గరగా పనిచేస్తున్నాయని, వాటిని త్వరలోనే 145 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు.
కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 560 టన్నుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని, అయితే ఇది అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉందని ఎటెఫా చెప్పారు. యుద్ధంలో రోడ్లు దెబ్బతిన్న కారణంగా దక్షిణ ప్రాంతానికి ఫుడ్ ట్రక్కులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాజాగా దక్షిణ మరియు మధ్య గాజాకు 57 ట్రక్కులు చేరుకున్నాయని, ఇది ఒక కీలక పరిణామమని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం