హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

- October 18, 2025 , by Maagulf
హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

హైదరాబాద్: హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగాన్ని, స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ‘ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సు అక్టోబర్ 31 మరియు నవంబర్ 1 తేదీల్లో మాదాపూర్ హైటెక్స్‌లో రెండు రోజులపాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక సంఘం అయిన TiE Globalలో భాగంగా టీఐఈ హైదరాబాద్ ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.

ఈ సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సహా 25కు పైగా పెట్టుబడి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. దాదాపు 1,500 మందికి పైగా పారిశ్రామికులు, విధాన నిర్ణేతలు, వ్యవస్థాపకులు, అలాగే 500కిపైగా స్టార్టప్ కంపెనీలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ & డీప్ టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, తయారీ, డిఫెన్స్ & ఏరోస్పేస్ వంటి 20 ప్రధాన రంగాలపై చర్చలు జరుగుతాయి.

సదస్సు సందర్భంగా వ్యవస్థాపకతలో విశేష కృషి చేసిన వారికి ‘TiE ఎక్సలెన్స్ అవార్డులు’,
మరియు తెలంగాణలోని అత్యంత ఆశాజనకమైన 50 స్టార్టప్‌లకు ‘TiE 50 అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. టీఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల మాట్లాడుతూ, ఈ సమ్మిట్ స్టార్టప్‌లకు నిధుల సమీకరణ, జాతీయ స్థాయి గుర్తింపు, మరియు భాగస్వామ్య అవకాశాలను అందిస్తుందని తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌లో స్టార్టప్ నిధుల సేకరణ 160% పెరిగి $571 మిలియన్‌కి చేరిన నేపథ్యంలో, ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com