కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకొచ్చే అంశంపై చర్చలు
- July 22, 2016
ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ ఈ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. 108 క్యారట్ల వజ్రాన్ని పొదిగిన కిరీటాన్ని ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగాగానీ, దొంగతనం ద్వారాగానీ తీసుకెళ్లలేదనీ, నాటి పంజాబ్ పాలకులు ఈస్టిండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని కేంద్రం ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే విషయంలో న్యాయపరమైన, సాంకేతిక అవరోధాలున్నాయని పేర్కొంది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్ని రకాలుగా కృషిచేస్తామని ప్రకటించింది. ఈ సమస్యకు సంతృప్తికరమైన పరిష్కారం కోసం విదేశీ వ్యవహారాల శాఖ తగిన మార్గాల కోసం వెదుకుతోందని మేలో కేంద్రమంత్రి మహేశ్‌శర్మ పార్లమెంటుకు తెలిపారు. దీనిపై భారత్‌సహా నాలుగు దేశాలు హక్కులు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







