కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!

- October 18, 2025 , by Maagulf
కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!

కువైట్:  కువైట్‌లోని పలు ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతుందని వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 60 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.  దీని వలన దుమ్ము తుఫానులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో బహిరంగ ప్రాంతాలలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.అలాగే, సముద్రపు అలలు 6 అడుగుల కంటే ఎక్కువగా ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ తన హెచ్చరికలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com