3.6 మిలియన్ ప్రయాణీకులకు వరం రియాద్ ట్రాన్స్పోర్ట్
- July 22, 2016
రియాద్‌లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ - కింగ్ అబ్దుల్ అజీజ్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోజుకి 3.6 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. మెట్రో మరియు బస్ నెట్వర్క్ ఇందులో భాగం. తొలి ఫేజ్‌తో 1 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందుతాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి వెన్నెముకగా నిలవనున్న రియాద్ మెట్రో నెట్వర్క్, క్యాపిటల్ సిటీలో ఆరు మెయిన్ లైన్స్‌తో 176 కిలోమీటర్ల మేర 85 స్టేషన్లతో చాలా ముఖ్యమైన ప్రాంతాల్ని కవర్ చేస్తుంది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ని ఈ మెట్రో లింక్ చేస్తుంది. 190 యూనిట్లతో 470 క్యాబిన్లు గల ఈ మెట్రో ట్రైన్ జర్మనీకి చెందిన సీమెన్స్, కెనడాకి చెందిన బాంబార్డియర్, ఫ్రాన్స్‌కి చెందిన అల్‌స్టామ్ కంపెనీలు రూపొందిస్తున్నాయి. 42 శాతం అండర్ గ్రౌండ్ టన్నెల్స్, గ్రౌండ్ ట్రాక్స్ 11 శాతం, ఎలివేటెడ్ ట్రాక్ 47 శాతం ఈ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగం. వెయ్యికి పైగా బస్సులు 900,000 మంది ప్రయాణీకుల కోసం రోజూ ఆపరేట్ చేయబడ్తాయి. బస్ నెట్‌వర్క్‌లో 6,700 వెయిటింగ్ స్టేషన్లు ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రత్యేకత.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







