బ్రెస్ట్ క్యాన్సర్‌ పై నాట్స్ అవగాహన సదస్సు

- October 30, 2025 , by Maagulf
బ్రెస్ట్ క్యాన్సర్‌ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికా: తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా నాట్స్  మహిళల కోసం  ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించింది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చికిత్సపై ఉన్న అపోహలను తొలగించి, సరైన సమాచారాన్ని అందించేలా ఈ అవగాహన సదస్సు జరిగింది. నాట్స్ మహిళా నాయకులు ఈ సదస్సులో పాల్గొని బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఉన్న మహిళలకు అవగాహన కల్పించారు.  బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన అనేది కేవలం సమాచారం మాత్రమే కాదని ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధనమని నాట్స్ మహిళా నాయకులు వివరించారు.. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. అందుకే, ప్రతి మహిళా తన ఆరోగ్యాన్ని, జీవితాన్ని అత్యంత విలువైనదిగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి తో పాటు, బోర్డు నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు యలమంచిలి క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్ నిర్వహించటం లో కీలక పాత్ర పోషించారు నాట్స్ న్యూజెర్సీ సభ్యులు సురేంద్ర పోలేపల్లి, సాయి లీలా మాగులూరి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందడి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, పాస్ట్ చైర్ ఉమన్ అరుణా గంటి, గంగాధర్ దేసు, శ్రీదేవి జాగర్లమూడి, గాయత్రి చిట్టేటి, స్వర్ణ గడియారం, స్మిత, సాగర్ రాపర్ల, మౌర్య యలమంచిలి, రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com