'అఖండ 2: తాండవం' బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్ ని పరిచయం చేస్తున్న సెన్సేషనల్ కం

- October 30, 2025 , by Maagulf
\'అఖండ 2: తాండవం\' బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్ ని పరిచయం చేస్తున్న సెన్సేషనల్ కం

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'.  ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్ పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ని నెక్స్ట్ లెవల్ లో సెన్సేషనల్ కంపోజర్ తమన్. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం వున్న పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులతో ఇప్పటికే గూస్‌బంప్స్‌ స్కోర్ ని రికార్డ్ చేశారు.

ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ ని పరిచయం చేస్తున్నారు. సర్వేపల్లి సిస్టర్స్ ‘అఖండ 2: తాండవం’ కోసం తమ డివైన్ వోకల్స్ అందించారు. థమన్‌ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌పవర్ ఫుల్  స్కోర్‌లో సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్ తో నెక్స్ట్ లెవల్ స్కోర్ లోడ్ అవుతోంది.  

ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌.

అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com