ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- November 03, 2025
మస్కట్: ఆహార భద్రతను బలోపేతం చేయనున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ మేరకు జాతీయస్థాయిలో డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా అల్ దహిరా గవర్నరేట్‌లోని పలు వ్యూహాత్మక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడడంతోపాటు స్థానిక మరియు గల్ఫ్ మార్కెట్లకు అధిక-నాణ్యత ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
"ఒమన్ విజన్ 2040" లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందినట్లు అల్ దహిరా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లోని యానిమల్ వెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ బిన్ అలీ అల్ షాండౌడి నివేదిక తెలిపింది. ఆహార భద్రతను మెరుగుపరచడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందకు చేపట్టిన ప్రయత్నాలలో ఇది భాగమన్నారు. ఇందులో భాగంగా ఐదు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఏడు ఇన్వెస్ట్ మెంట్ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు, వీటి విలువ సుమారు OMR35 మిలియన్లు ఉంటుందని తెలిపారు. "గల్ఫ్ ఇంటర్నేషనల్ పౌల్ట్రీ ఫామ్" ప్రాజెక్ట్ ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటిగా అల్ షాండౌడి వెల్లడించారు.
దేశీయ మరియు గల్ఫ్ మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ గుడ్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతుందన్నారు. అలాగే OMR1.35 మిలియన్లతో మేకల ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రారంభినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల ద్వారా ఒమానీ జాతీయులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







