ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- March 11, 2026
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో దశల వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మార్చి 28న జరగనున్న ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. మార్చి 29న జరిగే ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది.
ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ షెడ్యూల్ ఇదే..
* మార్చి 28 – ఆర్‌సీబీ vs సన్‌రైజర్స్
* మార్చి 29 – ముంబై vs కేకేఆర్
* మార్చి 30 – రాజస్థాన్ vs చెన్నై
* మార్చి 31 – పంజాబ్ vs గుజరాత్ టైటాన్స్
* ఏప్రిల్ 1 – లక్నో vs ఢీల్లీ
* ఏప్రిల్ 2 – కోల్‌కతా vs సన్‌రైజర్స్
* ఏప్రిల్ 3 – చెన్నై vs పంజాబ్
* ఏప్రిల్ 4 – ఢిల్లీ vs ముంబై
* ఏప్రిల్ 4 – గుజరాత్ vs రాజస్థాన్
* ఏప్రిల్ 5 – సన్‌రైజర్స్ vs లక్నో
* ఏప్రిల్ 5 – ఆర్‌సీబీ vs చెన్నై
* ఏప్రిల్ 6 – కోల్‌కతా vs పంజాబ్
* ఏప్రిల్ 7 – రాజస్థాన్ vs ముంబై
* ఏప్రిల్ 8 – ఢిల్లీ vs గుజరాత్
* ఏప్రిల్ 9 – కోల్‌కతా vs లక్నో
* ఏప్రిల్ 10 – రాజస్థాన్ vs ఆర్‌సీబీ
* ఏప్రిల్ 11 – పంజాబ్ vs సన్‌రైజర్స్ * ఏప్రిల్ 11 – చెన్నై vs ఢిల్లీ * ఏప్రిల్ 12 – లక్నో vs గుజరాత్ * ఏప్రిల్ 12- ముంబై vs ఆర్‌సీబీ
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







