ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- March 11, 2026
ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్‌డేట్‌లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం విత్ డ్రాయల్స్, లాకర్ ఛార్జీల వంటి మార్పులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా మరికొన్ని ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఈ వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
HDFC Bank తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) 10 బేసిస్ పాయింట్ల (0.10%) వరకు తగ్గించింది. మార్చి 7, 2026 నుండి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఓవర్ నైట్, వన్ మంత్ MCLR రేట్లు 8.25 శాతం నుండి 8.15 శాతానికి తగ్గాయి. అలాగే ఒక సంవత్సరం MCLR రేటు 8.40 శాతం నుండి 8.35 శాతానికి తగ్గింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న పాత కస్టమర్ల EMI భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసే వారికి HDFC Bank తీపి కబురు అందించింది. 3 ఏళ్ల 1 రోజు నుండి 4 ఏళ్ల 7 నెలల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.40 శాతం నుండి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు ఏకంగా 7 శాతానికి చేరింది. సాధారణ కస్టమర్లకు ప్రస్తుతం 2.75% నుండి 6.50% వరకు.. సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7% వరకు వడ్డీ లభిస్తుంది.
ఏప్రిల్ 1, 2026 నుండి ఏటీఎం వద్ద యూపీఐ (UPI) ద్వారా నగదు తీసుకుంటే దానిని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం (ATM) లావాదేవీల పరిమితిలోనే లెక్కిస్తారు. ఒకవేళ ఉచిత పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలు.. వాటిపై వర్తించే పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లాకర్ సౌకర్యం వాడుతున్న వారి కోసం బ్యాంక్ కొత్తగా ‘మెట్రో ప్లస్’ అనే కేటగిరీని ప్రవేశపెట్టింది. ప్రాంతాన్ని బట్టి (మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, రూరల్) , లాకర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలను సవరించింది. దీనిపై అదనంగా జీఎస్టీ కూడా వర్తిస్తుంది. మీ బ్రాంచ్ ఉండే ప్రాంతాన్ని బట్టి లాకర్ ఛార్జీలు మారే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్రాంచ్ ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకుంటే మంచిది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం







