#NC24 నుంచి దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్
- November 04, 2025
యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 చేస్తున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న విజువల్ చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. ఫీల్డ్ డ్రెస్, గ్లవ్స్, గ్లాసెస్‌తో అంకితభావం,ధైర్యం గల ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి అద్భుతంగా కనబడుతున్నారు.
ఈ కథలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా క్రూషియల్ గా ఉండబోతోంది. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే దక్ష క్యారెక్టర్ మీనాక్షి కెరీర్లో మైల్ స్టోన్ కానుంది.
నాగ చైతన్య ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు. ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా కొనసాగుతోంది. లీడ్ కాస్ట్ మొత్తం షూట్లో పాల్గొంటున్నారు.
తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







