FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- November 05, 2025
విజయవాడ: చలన చిత్ర మరియు టెలివిజన్ రంగాలలో జాతీయ అంతర్జాతీయ సమ్మేళనాలతో పాటు ఈ రంగాల నటీనటుల సాంకేతిక నిపుణుల నైపుణ్యాలను ఇతర రాష్ట్రాల మరియు దేశాల బాషా చిత్రాలవారు ప్రోత్సహించేలా పరిచయ సదస్సులను నిర్వహిస్తూ మరియు ఆయా రాష్ట్ర దేశాలలో వెలుగులోకి రాణి అనేక పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రచారం చేస్తూ పర్యాటకరంగ అభివృద్ధికి విశేష కృషి సల్పుతున్న ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్తానం దక్కింది.ఈ సర్టిఫికెట్ ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి లు తమ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలలో విశిష్టతను కనబరిచిన వ్యక్తులు సంస్థలకు అందించే ఈ విశిష్ట గౌరవం FTPC ఇండియా కు దక్కడం తమ సంస్థపై మరింత బాధ్యతను పెంచిందని, ఇప్పటికే మన దేశంలోని అహ్మదాబాద్, ముంబై, కలకత్తా, హైదరాబాద్, విశాఖపట్నంలలో మరియు విదేశాలైన సింగపూర్ మలేసియా శ్రీలంక, నేపాల్, బ్యాంకాక్ లలో పలు ఫిలిం ఎక్స్ చేంజ్ కార్యక్రమాలను నిర్వహించిన తాము త్వరలో దుబాయ్, బాలి, వియాత్నంలలో కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి మన నటులు సాంకేతిక నిపుణులు ఆయా బాషల చిత్రాలకు పనిచేసేలా వారికి మన చిత్రాలలో అవకాశాలు దక్కేలా సంస్థ కృషి చేయనుందని అధ్యక్షులు చైతన్య జంగా తెలిపారు. సంస్థ ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా మన చిత్రాల మార్కెట్ పరిధి చిన్న చిన్న దేశాల మొదలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు దోహదపడుతుందని, కంటెంట్ ప్రధానంగా నిర్మితమైన చిన్నచిత్రాలు భాషకు సంబంధం లేకుండా ఆదరణ పొందేలా , మన నటీనటులు పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి పరిచయం చేసే విశిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అంతేకాకుండా ఆయా నటీనటులు పర్యటక ప్రాంతాలను ఇతరబాషా చిత్ర పరిశ్రమలకు పరిచయం చేసేలా ఇంటరాక్షన్ కార్యక్రమాలను చేపడుతున్నామని తద్వారా మన నటులు, సాంకేతిక నిపుణులకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు లభించేందుకు దోహదపడుతున్నామని అలాగే మన పర్యటన ప్రాంతాలకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించి ఈ విశిష్ట గౌరవాన్ని అందించిన ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ డాక్టర్ అవినాష్ డీ సుకుండే కు, ఇండియా చైర్మన్ ఎస్ అలోక్ కుమార్ లకు అధ్యక్ష కార్యదర్సులు, కమిటీ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.
కృషి అంకితభావంతో ప్రపంచవ్యాప్త సినిమా ను ఒకే వేదిక పైకి తీసుకురావాలన్న సంకల్పంతో FTPC ఇండియా చేపడుతున్న అసాధారణ కార్యక్రమాలు ఈ రంగాలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థలకు ఓ మార్గదర్శి గా నిలుస్తున్నాయని, ఈ విజయ పరంపరను గుర్తించాలన్న కమిటీ ఏకగ్రీవ అభిప్రాయంతోనే FTPC ఇండియా కు తమ ఫోర్బ్స్ గ్లోబల్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కల్పించామని సంస్థ ఇండియా చైర్మన్ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







