బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- November 05, 2025
న్యూ ఢిల్లీ: మీకు పాన్ కార్డు ఉందా? మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే లింక్ చేసుకోండి. అలా చేయకపోతే మీ పాన్ కార్డు పూర్తిగా డియాక్టివేట్ అయిపోతుంది. డిసెంబర్ 31 గడువు తేదీలోగా పాన్, ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆ పాన్ ఇక పనిచేయదు.
అందుకే ముందుగా గడువు తేదీకి (PAN Aadhaar Link) ముందుగానే ఆధార్, పాన్ లింక్ చేసుకోవాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఏప్రిల్‌లో జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్ 26/2025 ప్రకారం.. అన్ని పాన్ హోల్డర్లు ఈ లింకేజీని పూర్తి చేయడం తప్పనిసరి చేసింది.
ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు బ్యాంక్ లేదా డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేసేందుకు భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు, రుణాల కోసం అప్లయ్ చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి. సీబీడీటీ గడువుకు ముందు ఆధార్‌తో లింక్ చేయడం విఫలమైతే పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఇంతకీ ఆన్‌లైన్‌లో పాన్ కార్డుతో ఆధార్ ఎలా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం..
మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అయితే ఏమౌతుంది?
డియాక్టివేట్ పాన్ కార్డు అంటే.. మీరు దాదాపు అన్ని ప్రభుత్వ సేవలకు యాక్సస్ కోల్పోతారు. కొత్త బ్యాంక్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లో మొదలుపెట్టలేరు. రూ. 50వేల కన్నా ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా క్యాష్ డిపాజిట్లు అనుమతించరు. లోన్ కోసం అప్లయ్ చేసేందుకు ఆస్తి కొనడం లేదా అమ్మడం లేదా వాహనాన్ని రిజిస్టర్ చేసేందుకు కూడా యాక్టివ్ పాన్ అవసరం. లేదంటే అన్ని పనులు ఆగిపోతాయి.
అదనంగా, రూ. 50వేల కన్నా ఎక్కువ ఫారెన్ కరెన్సీ లావాదేవీలు చేయలేరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యాపార రిజిస్ట్రేషన్లు కూడా అందుబాటులో ఉండవు. ముఖ్యంగా, మీ పాన్ తిరిగి యాక్టివ్ అయ్యే వరకు మీ క్రెడిట్ లావాదేవీలన్నీ స్తంభించిపోతాయి. అందుకే ఆధార్, పాన్ కార్డుతో తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. మీరు ఇంకా లింక్ చేయకపోతే ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఆధార్‌తో పాన్ ఎలా లింక్ చేయాలి?
- పాన్, ఆధార్ లింక్ చాలా సులభం. కొన్ని నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.
- అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ (incometax.gov.in) పోర్టల్‌ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో ‘Link Aadhaar’పై క్లిక్ చేయండి.
- మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయండి.
- ‘Validate’ క్లిక్ చేయండి.
- ఇప్పటికే లింక్ చేయకపోతే OTP ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు OTP సబ్మిట్ చేయండి.
- లింక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్‌పై కన్ఫార్మేషన్ మెసేజ్ అందుకుంటారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







