గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!

- November 05, 2025 , by Maagulf
గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!

దోహా: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ హెచ్ ఇ ఆంటోనియో గుటెర్రెస్ ఖతార్‌ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐక్యరాజ్యసమితికి దృఢమైన స్నేహితుడు అని కొనియాడారు. ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి నిర్మాణ ప్రయత్నాలలో దాని చురుకైన పాత్రను అభినందించారు.

దోహాలో ప్రారంభమైన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు (WSSD2) లో గుటెర్రెస్ పాల్గొన్నారు. ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలోని బాలికలకు విద్యను ప్రోత్సహించడంలో ఖతార్ ప్రత్యేక చొరవను సెక్రటరీ జనరల్ ప్రసంశించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఖతార్ ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని ఆయన ప్రస్తావించారు.  అక్కడ ఆ దేశం బాలికలకు విద్యను అందుబాటులో ఉంచడంలో సహాయం చేస్తోందని పేర్కొన్నారు.

అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌తో అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోందన్నారు.  ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడంలో ఖతార్ దౌత్య ప్రయత్నాలను గుటెర్రెస్ ప్రశంసించారు. గాజా వివాదంలో శాశ్వత మధ్యవర్తిగా మరియు DRC ప్రభుత్వం మరియు M23 సాయుధ బలగాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదరడంలో ఖతార్ మధ్యవర్తిత్వం వహించిందని ఆయన అన్నారు.

కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగుతున్న గాజాలో తక్షణ చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ పిలుపునిచ్చారు. రెండు దేశాల పరిష్కారానికి అవసరమైన విశ్వసనీయ రాజకీయ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. సూడాన్‌లో, ముఖ్యంగా ఉత్తర డార్ఫర్‌లోని ఎల్ ఫాషర్ ప్రాంతంలో పెరుగుతున్న మానవతా సంక్షోభంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  హింసను వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com