కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!
- November 05, 2025
కువైట్: కువైట్ పోలీసులు ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్‌వర్క్ ను ఛేదించారు. ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ మేరకు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వ్యవస్థీకృత నేరాల నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించింది.
ముఠా సభ్యులు గ్యాబ్లింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నిధులను బదిలీ చేసి, వాటిని మెడికల్ క్లినిక్ మరియు వాణిజ్య సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలలో జమ చేయడం ద్వారా వాటిని చట్టబద్ధం చేస్తున్నారని తెలిపారు. అనంతరం వాటిని చట్టబద్ధమైన ఆదాయంగా చూపించి, ఆపై వాటిని రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్తంగా ఉండాలని, వాటి కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట ప్రకారం నేరమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఏదైనా అనుమానాస్పద ఎలక్ట్రానిక్ లేదా ఆర్థిక కార్యకలాపాలను నివేదించడం ద్వారా అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్‌లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







