డోవర్ లో 12 ఘంటలపైగా ట్రాఫిక్ జామ్
- July 24, 2016
ఒకదాని వెంటే మరో వాహనం.. 20 కిలోమీటర్లకుపైగా స్తంభించిన ట్రాఫిక్. వేలాది వాహనాల్లో లెక్కకు మించిన జనం.. పైన ఎండ వాత.. లోన ఉక్కపోత.. గంటా రెండు గంటలూ కాదు గడిచిన రెండు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. ఇప్పుడు స్తంభించిన ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. వాహనాల్లో చిక్కకుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళలదైతే అరిగోస! ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది పొరుగుదేశం కాబట్టి!బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. ఫ్రాన్స్ బ్రెగ్జిట్ కు ప్రతీకారం తీర్చుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







