చైనీస్ ఏ డివిజన్ చెస్ లీగ్ గ్రాండ్ మాస్టర్ హారిక విజయం
- July 24, 2016
చైనాలోని జియాజింగ్‌లో జరుగుతున్న చైనీస్ ఏ డివిజన్ చెస్ లీగ్ రెండో గేమ్‌లో తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక విజయం సాధించింది. షాన్డాంగ్ తరఫున ఆడుతున్న హారిక తియాజింగ్ ఆటగాడు ని షిక్వాన్ను ఓడించింది. 'ఈ రోజు నేను నల్లపావులతో ఆడాను. గేమ్‌ను వెంటనే సంక్లిష్ట దారి పట్టించాను. ప్రత్యర్థి తప్పులు చేయడంతో 26 ఎత్తుల్లోనే విజయం సాధించాను. నేను ఆడిన విధానం నాకు సంతోషాన్నిచ్చింది అని' హారిక తెలిపింది.
లీగ్‌లో షాంఘై తరఫున ఆడుతున్న భారత మరో గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ ప్రత్యర్థి జెన్ షాంగ్సెంగ్ (గ్వాంగ్డాంగ్)పై విజయం సాధించాడు. చైనీస్లీగ్లో మొత్తం 12 జట్లుంటాయి. చైనాలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లూ ఉంటారు. 22 రౌండ్లు ఉండే ఈ లీగ్‌ను ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. ప్రస్తుత సెషన్ జులై 26న ముగుస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







