రైలు ప్రయాణికులకు శుభవార్త..!!
- July 24, 2016
రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు త్వరలోనే రైళ్లలో రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట 1000 రైళ్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రేడియోలో ప్రయాణికులకు పాటలతో పాటు రైలుకు సంబంధించిన సమాచారం అందించనుంది. రైల్వే చరిత్ర, ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సౌకర్యాలను, ఏదైనా అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రముఖ రేడియో సంస్థలతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు 2016-17 బడ్జెట్లో ప్రజలకు వినోదం అందించేందుకు రైలు రేడియోల ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సౌకర్యం శతాబ్ది, రాజధాని రైళ్లలో మాత్రమే ఉంది. మిగతా రైళ్లలో కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ రైలు రేడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం సులభతరమౌతుంది. దీంతో పాటు ప్రస్తుతం ప్రముఖ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్న రైలుబంధు అనే ద్విభాషా మ్యాగజైన్‌ను కూడా అన్ని రైళ్లలోకి, అన్ని భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







