విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్

- November 12, 2025 , by Maagulf
విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బి వీసా(H-1B visa) పథకంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకు కఠిన చర్యలతో వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఆ పథకాన్ని సమర్థిస్తూ, అమెరికా కొన్నిరంగాల్లో విదేశీ ప్రతిభ అవసరమని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు లారా ఇంగ్రహామ్ తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అన్ని రంగాల్లో తగినంత ప్రతిభ కలిగి లేదు.

కొన్ని ముఖ్యమైన రంగాల్లో మేధస్సు, నైపుణ్యం అవసరం ఉంది. ఆ ప్రతిభను ప్రపంచం నలుమూలల నుండి తీసుకురావాలని ట్రంప్ అన్నారు.

మనం దేశంలోకి ప్రతిభను కూడా తీసుకురావాలి. కొన్ని రంగాల్లో మనదేశంలో సరిపడ నైపుణ్యాలు లేరు. కాబట్టి ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం తప్పనిసరి అని తెలిపారు. ఇది ట్రంప్ ఇప్పుటి వరకు హెచ్-1బి వీసా విధానంపై తీసుకున్న కఠిన చర్యలకు పూర్తి వ్యతిరేకంగాఉంది. గతంలో ఆయన పరిపాలన హెచ్-1బి వీసాల మంజూరులో కఠినతను పెంచి, అనేక టెక్ కంపెనీలకు, విదేశీ నిపుణులకు అవరోధాలు సృష్టించింద. 

ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, వైద్యులు, టెక్ రంగంలో పనిచేసే వేలాదిమంది హెచ్-1బి వీసా హోల్డర్లు ఆ నియంత్రణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శిక్షణ లేకుండా కార్మికులను నియమించడం కష్టం అమెరికాలో తయారీ, రక్షణ రంగాలలో తగిన శిక్షణ లేకుండా స్థానిక కార్మికులను నియమించడం కష్టం అని ఆయన అన్నారు. దీర్ఘకాలిక నిరుద్యోగులలో చాలామంది సాంకేతిక రంగంలో పని చేయడానికి సరైన నైపుణ్యం కలిగి లేరని, కాబట్టి విదేశీ నిపుణులను ఆకర్షించడం అమెరికా అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com