'మజ్ను' గా మారిన నాని

- July 24, 2016 , by Maagulf
'మజ్ను' గా మారిన నాని

నాని కథానాయకుడిగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. పి.కిరణ్‌ నిర్మాత. తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేశారు. 29 ఏళ్ల క్రితం నాగార్జున కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది. 'ప్రేమమ్‌' చిత్రానికి 'మజ్ను' అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే 'మజ్ను'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com