చండీగఢ్‌లో నీటిపై తేలే సౌర విద్యుత్ కర్మాగారం
- July 24, 2016
నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కర్మాగారాన్ని చండీగఢ్‌లో ప్రారంభమైంది. నగరాన్ని సౌర విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఈ 10 కేడబ్ల్యూపీ సామర్థ్య ప్లాంట్‌ను ధనాస్ సరస్సులో దీన్ని ఏర్పాటు చేశారు. సరస్సు శుద్ధి కోసం చేపట్టే ఏరేషన్ ప్రక్రియలోని ఫౌంటెయిన్లకు విద్యుత్ సరఫరా చేసేలా దీన్ని రూపొందించారు. ఇందులో దేశీయంగా రూపొందించిన డ్యుయెల్ యాక్సిస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఫలితంగా నేలమీద ఏర్పాటు చేసే సంప్రదాయ ఫొటోవోల్టాయిక్ సౌర కేంద్రాల కన్నా 30 శాతం అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
నమూనా సౌర విద్యుత్ నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం చండీగఢ్‌ను ఇప్పటికే ఎంపిక చేసింది. దీనికింద 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సౌర విద్యుత్ వాటా 100 గిగావాట్లు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







