చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- November 16, 2025
న్యూ ఢిల్లీ: చంద్రయాన్-4 అంతరిక్ష ప్రయోగం పై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. భారత్ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 2027లో ఉండనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మరో 7 ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఇస్రో మరో ఏడు ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. వీటిలో కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్లతో పాటు, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మిషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ -4 గురించి కీలక విషయాలను చెప్పారు. చంద్రుడి నమూనాలను సేకరించి భూమికి తిరిగి వచ్చే వ్యోమనౌకగా చంద్రయాన్-4 ప్రయోగం ఉండబోతోంది.ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రలో ఒకటిగా నిలువబోతోంది. దీంతో పాటు JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ LUPEX ద్వారా చంద్రుడి ధ్రువాల అన్వేషణ కార్యక్రమం కూడా ఉండబోతోంది. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిన ధ్రువంలోని వాటర్ ఐస్‌ను అధ్యయనం చేయనున్నారు.ఇస్రో ప్రయోగాలతో బిజీ అవుతున్న తరుణంలో తన వార్షిక అంతరిక్ష నౌకల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడానికి ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ -4 చంద్రుడి ననుంచి నమూనాలనున భూమికి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనాలు మాత్రమే ఇలాంటి విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అంతరిక్షంలో సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోంది. దీనికి పని ప్రారంభించినట్లు నారాయణన్ చెప్పారు. ఐదు మాడ్యుళ్లతో ఈ కేంద్రాన్ని 2028లో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. దీనిని 2035 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాసా ఐఎస్ఎస్, చైనీస్ అంతరిక్ష సంస్థకు తియాంగాంగ్ వంటి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







