'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్

- November 16, 2025 , by Maagulf
\'దమ్ముంటే పట్టుకోండి\' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు గత కొంతకాలంగా సినిమాలను పైరసీ చేసే వాళ్ళ మీద బాగా ఫోకస్ పెట్టారు.ఇప్పటికే లోకల్ టీమ్స్ ని చాలా మందిని పట్టుకున్నారు.ఐ బొమ్మ మీద టార్గెట్ చేస్తే ఐ బొమ్మ నిర్వాహకుడు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు.దీంతో పోలీసులు ఐ బొమ్మ టార్గెట్ గా పైరసీ ని అంతం చేయడానికి పనిచేసారు.

ఈ క్రమంలో ఐ బొమ్మ, బప్పం సైట్స్ నిర్వాహకుడిని శనివారం నాడు అరెస్ట్ చేసారు. నిర్వాహకుడు రవితోనే ఆ వెబ్సైట్లు క్లోజ్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడి రవి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకొని, అతని అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి విశ్లేషిస్తున్నారు పోలీసులు. నిందితుడి ఇమ్మడి రవిని కస్టడీకి కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేయనున్నారు.

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు.ఆయన CP గా ఉన్నప్పుడే ఈ పైరసి వేట మొదలైంది. దీంతో పోలీసులను అభినందిస్తూ ఆయన తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

CV ఆనంద్ తన ట్విట్టర్లో.. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పోలీసులనే సవాలు చేస్తూ బెదిరించిన వ్యక్తిని చివరకు అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మరియు టీమ్ కి నా అభినందనలు. ఈ సందర్భంగా హెచ్‌డీ మూవీ పైరసీ కేస్ ప్రెస్ మీట్ వివరాలు మళ్లీ రీపోస్ట్ చేస్తున్నాను. హ్యాకర్లు డిజిటల్ కంపెనీస్ సర్వర్లు హ్యాక్ చేసి సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ కాపీలను తమ వెబ్‌సైట్లలో విడుదల చెయ్యటం వలన సినిమా పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చాయి. జూన్ 5 నుండి రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సైబర్ క్రైమ్ టీమ్ ఈ పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న రవిని తప్ప.హైదరాబాద్ సిటీ పోలీస్, సజ్జనార్, మరియు DCP సైబర్ క్రైమ్స్ కి నా అభినందనలు అని పోస్ట్ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com