ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- November 16, 2025
తిరుమల: 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
24న శ్రీవాణి దర్శన కోటా విడుదల
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







