ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- November 16, 2025
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదిక పై కనిపించారు.చాలా రోజుల తర్వాత వారు ఒకే చోట కలిసి కనిపించారు. అంతేనా..పక్కపక్కనే కూర్చున్నారు.సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వులు చిందించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ గెస్టులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.
ఇక, ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







