లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

- November 17, 2025 , by Maagulf
లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించిన ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా కీలక రంగాలలో పనిచేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సమావేశాల్లో పాల్గొన్న సంస్థలు:

  • NCL–నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్
  • NFL–నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
  • MOIL–మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్
  • RITES–రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీసెస్
  • WAPCOS–వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్

సంస్థల పనితీరు,ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృత చర్చలు జరిగాయి. ప్రజా రంగ సంస్థల అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక బలోపేతం వంటి అంశాలపై సూచనలు, సమీక్షలు ప్రధానంగా చర్చించబడ్డాయి.ఎంపీ బాలశౌరి ఈ చర్చల్లో సక్రియంగా పాల్గొని పలు సూచనలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com