డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- March 11, 2026
దోహా: పేలుళ్లు లేదా ఆకాశం నుండి పడిపోతున్న వస్తువులు, శకలాలకు దూరంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది.అలాంటి వస్తువులను సమీపించవద్దని, తాకవద్దని లేదా తరలించవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలు ఈ ఆదేశాన్ని పాటించడం ఎంత ముఖ్యమో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
శకలాలు తీవ్రమైన గాయాలకు కారణమవుతాయని,ఎందుకంటే అవి తాకినట్లయితే లోతైన గాయాలు లేదా రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
పేలుళ్ల తర్వాత ఇటువంటి పదార్థాలు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయని, వాటిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు అవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొన్ని శలాలు పేలకుండా ఉండే అవకాశం ఉండవచ్చని, వాటిని తరలించినా లేదా తాకినా పేలుడు సంభవించవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, పేలుళ్ల నుండి వచ్చే శలాల్లో ఇంధన అవశేషాలు, రసాయనాలు లేదా పేలుడు నుండి వచ్చే ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉండవచ్చని, వీటిని టచ్ చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పేర్కొంది.
దాంతోపాటు శకలాలను తరలించడం వల్ల సంఘటనల కారణాన్ని గుర్తించడానికి అవశేషాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనికి ఆటంకం కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అలాంటి వస్తువులను గుర్తించిన వెంటనే 999కి కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







