కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్‌మెంట్ 2025

- November 17, 2025 , by Maagulf
కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్‌మెంట్ 2025

న్యూ ఢిల్లీ: కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్-బి (నాన్‌ గేజిటెడ్) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులు భర్తీ చేయనున్నాయి.                                                  పోస్టుల వివరాలు సబ్జెక్ట్ వారీగా...

  • కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 124
  • డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: 10
  • ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్: 95
  • సివిల్ ఇంజినీరింగ్: 02
  • మెకానికల్ ఇంజినీరింగ్: 02
  • ఫిజిక్స్: 06
  • కెమిస్ట్రీ: 04
  • మ్యాథమెటిక్స్: 02
  • స్టాటిస్టిక్స్: 02
  • జియాలజీ: 03

DFO 2025 Recruitment అర్హతలు

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పైగా పేర్కొన్న సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
  • GATE 2023, 2024, 2025 ఏదైనా ఒక సంవత్సరం యొక్క స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
  • వయో పరిమితి 30 ఏళ్లు మించకూడదు.                                                                                                                                                                                        దరఖాస్తు విధానం & ఎంపిక
  • అభ్యర్థులు డిసెంబర్ 14, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్టు ద్వారా Lodhi Road, Head Post Office, New Delhi కు పంపాలి.
  • ఎంపిక: GATE స్కోర్(GATE Score), ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ల పరిశీలన ఆధారంగా.
  • జీతం: ₹99,000 + ఇతర అలవెన్స్‌లు.

మొత్తం DFO పోస్టుల సంఖ్య ఎంత?
250 పోస్టులు.

దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?
14 డిసెంబర్ 2025.

ఏవీ GATE స్కోర్లు అంగీకరించబడతాయి?
GATE 2023, 2024, 2025 ఏదైనా ఒక సంవత్సరం.

వయో పరిమితి ఎంత?
30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
GATE స్కోర్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ల పరిశీలన ఆధారంగా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com