వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!
- March 17, 2026
కువైట్ః కువైట్ లోని సాల్మియా, జాబ్రియా మరియు అల్-రాయ్‌లోని వాటర్ ట్యాంకర్ల ధరలను పెంచడంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది ఉల్లంఘనలను నమోదు చేసి యజమానులకు నోటీసులు జారీ చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అత్యవసర తనిఖీ బృందాలు నిర్వహించిన క్షేత్ర పర్యటనల సమయంలో ఉల్లంఘనలు గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ట్యాంకర్ యజమానులు నియంత్రణ నిర్ణయాల ప్రకారం నిర్ణయించిన ధరలకు కట్టుబడి ఉండాలని కోరింది. వినియోగదారుల హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేసే ధరలను పెంచడంపై పర్యవేక్షణ కొనసాగతుందని తెలిపింది. మార్కెట్ పర్యవేక్షణ మరియు వస్తువులు మరియు సేవల లభ్యతను నిర్ధారించడానికి మరియు దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కులను రక్షించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







